Story Switch to 1-Column WhatsApp
maneti.in
29 November 2026, 1:13 PM Peddapalli By: MaaNeti News

దేవునిపల్లి లక్ష్మీనరసింహ స్వామి వారి రథోత్సవంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ విజయరమణ రావు.

దేవునిపల్లి లక్ష్మీనరసింహ స్వామి వారి రథోత్సవంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ విజయరమణ రావు.

పెద్దపల్లి మానేటి న్యూస్ ప్రతినిధి నవంబర్ 29/ దేవునిపల్లి గ్రామంలో కొలువుదీరిన శ్రీ. లక్ష్మి నరసింహ స్వామి వారి రథోత్సవంలో సందర్భంగా స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన గౌరవ రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి శాసనసభ్యులు శ్రీ. చింతకుంట విజయరమణ రావు. ప్రత్యేక పూజలు నిర్వహించిన ప్రభుత్వ విప్ విజయరమణ రావు కి ఆలయ అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు. ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే విజయరమణ రావు ని ఘనంగా సన్మానించారు. అనంతరం పెద్దపల్లి పట్టణంలోని బందంపల్లి లో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని స్థానిక నాయకులతో కలిసి గౌరవ ప్రభుత్వ విప్ విజయరమణ రావు ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

పెద్దపల్లి మండలం దేవునిపల్లి గ్రామంలో కొలువుదీరిన శ్రీ. లక్ష్మి నరసింహ స్వామి వారి జాతర సందర్భంగా ఉమ్మడి జిల్లా నుండి అనేక మంది భక్తులు స్వామి వారి దర్శనం కోసం విచ్చేస్తారని వారికి అన్ని రకాల సదుపాయాలు కల్పించాలని అధికారులకు సూచనలు చేయడం జరిగిందని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని అలాగే పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలు అందరూ శ్రీ. లక్ష్మి నరసింహ స్వామి వారి ఆశీస్సులతో సుఖశాంతులతో పాడి పంటలతో ఆనందంగా ఉండాలని కోరుకున్నట్టు తెలిపారు. పెద్దపల్లి నియోజకవర్గంలో తాను శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత నుండి రైతులు పండించిన పంటలో ఎలాంటి కటింగ్లు లేకుండా చేసి రైతన్నలకు వెన్నుదన్నుగా నిలిచారని గుర్తు చేశారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో పారదర్శకంగా వ్యవహరించాలని నిర్వాహకులకు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో దేవునిపల్లి గ్రామ సర్పంచ్, పెద్దపల్లి మున్సిపల్ చైర్మన్, బందంపల్లి కౌన్సిలర్, సింగిల్ విండో చైర్మన్లు, డైరెక్టర్లు, లక్ష్మీనరసింహ స్వామి ఆలయ సభ్యులు, పట్టణ అధ్యక్షులు, ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు.