మానేటి న్యూస్ ప్రతినిధి నవంబర్ 29/ క్రికెట్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రజాదరణ పొందిన క్రీడాని ముఖ్యంగా భారతదేశంలో క్రికెట్కు కోట్లాది మంది అభిమానులు ఉన్నారని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి.నరేందర్ రెడ్డి స్థానిక కొత్తపల్లి లోని అల్ఫోర్స్ ఇ-టెక్నో పాఠశాలలో వేడుకగా నిర్వహించినటువంటి క్రికెట్ పోటీలను వారు అట్టహాసంగా విద్యార్థుల కేరింతల మధ్య ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రికెట్ తో అనేక లాభాలు ఉన్నాయని ప్రముఖంగా శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుందని, జట్టుగా కలిసి పనిచేసే గుణం ఏర్పడుతుందని, ఏకాగ్రత - ఆత్మవిశ్వాసం పెరుగుతాయని, క్రమశిక్షణ సమయపాలన అలవడతాయని, ముఖ్యంగా నాయకత్వ లక్షణాలను సైతం అభివృద్ధి చెందుతాయని వారు చెప్పారు.
క్రికెట్ యొక్క ప్రాముఖ్యత దృష్టిలో పెట్టుకొని మరియు విద్యార్థుల యొక్క ఆసక్తిని పరిగణలోకి తీసుకొని నేడు పాఠశాలలో నాలుగు విభాగాల లక్ష్యా, తేజస్, దృవ & సరస్ విద్యార్థులకు మధ్య క్రికెట్ పోటీలను నిర్వహించడం జరిగిందని వారు చెప్పారు.
ఈ క్రికెట్ పోటీల్లో అద్భుత ప్రదర్శన కనబరిచిన విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేయడం జరుగుతుందని వారు చెప్పారు. విద్యార్థులకు క్రీడల పట్ల ఆసక్తిని పెంపొందించాల్సినటువంటి బాధ్యత తల్లిదండ్రులని మరియు విద్యార్థుల్లో దాగిన ప్రతిభ వెలికి తీసే బాధ్యత వ్యాయామ ఉపాధ్యాయులు అని గుర్తు చేస్తూ ప్రతి విద్యార్థికి ఏదో ఒక రంగంలో ప్రతిభ ఉంటుందని ఆ రంగంలో వారిని నిష్ణాతులను చేయడమే అల్ఫోర్స్ విద్యాసంస్థల లక్ష్యమని వారు తెలుపుతూ క్రికెట్ పోటీల ప్రారంభోత్సవం సందర్భంగా క్రీడాకారులను పరిచయం చేసుకొని శుభాకాంక్షలు తెలియజేసి, చక్కటి క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలని వారు చెప్పారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, వ్యాయామ ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు విద్యార్థులకు.