మానేటి న్యూస్ ప్రతినిధి నవంబర్ 29/ క్రికెట్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రజాదరణ పొందిన క్రీడాని ముఖ్యంగా భారతదేశంలో క్రికెట్కు కోట్లాది మంది అభిమానులు ఉన్నారని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి.నరేందర్ రెడ్డి స్థానిక కొత్తపల్లి లోని అల్ఫోర్స్ ఇ-టెక్నో పాఠశాలలో వేడుకగా నిర్వహించినటువంటి క్రికెట్ పోటీలను వారు అట్టహాసంగా విద్యార్థుల కేరింతల మధ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రికెట్ తో అనేక లాభాలు ఉన్నాయని ప్రముఖంగా శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుందని, జట్టుగా కలిసి పనిచేసే గుణం ఏర్పడుతుందని, ఏకాగ్రత - ఆత్మవిశ్వాసం పెరుగుతాయని, క్రమశిక్షణ సమయపాలన అలవడతాయని, ముఖ్యంగా నాయకత్వ లక్షణాలను సైతం...